- Border Gavaskar Trophy
- US Elections 2024
- Telugu News
- Movies News
Enemy Review: రివ్యూ: ఎనిమి
Enemy Review: విశాల్, ఆర్య కీలక పాత్రల్లో నటించిన ‘ఎనిమి’ సినిమా ఎలా ఉందంటే?
చిత్రం: ఎనిమి; నటీనటులు: విశాల్, ఆర్య, ప్రకాశ్‌రాజ్, మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్ తదితరులు; సంగీతం: తమన్, శ్యామ్; ఎస్ (నేపథ్య); ఎడిటింగ్: రేమాండ్ డేరిక్ క్రస్టా; సినిమాటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్; నిర్మాత: ఎస్.వినోద్ కుమార్; రచన, దర్శకత్వం: ఆనంద్ శంకర్; విడుదల తేదీ: 04-11-2021
ఈసారి దీపావళి బరిలో అనువాద చిత్రాల జోరు కనిపించింది. రజనీకాంత్ ‘పెద్దన్న’గా పండగ బరిలో దిగగా.. ఆయనకు పోటీగా ‘ఎనిమి’( Enemy) తో రేసులోకి దిగారు విశాల్(vishal), ఆర్య(arya). ‘వాడు వీడు’ తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించిన రెండో చిత్రమిది. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్‌గా ముస్తాబు చేశారు దర్శకుడు ఆనంద్ శంకర్. పాటలు, ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాల్ని ఈ చిత్రం ఏమేర అందుకుంది? (Enemy telugu movie review) పండగ వేళ విజయపతాకం ఎగురవేసిందా?
కథేంటంటే: భరత్ కల్యాణ్ (ప్రకాశ్ రాజ్-Prakashraj) ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. తన కొడుకు రాజీవ్ (ఆర్య)ను పోలీసు చేయాలని కలలుకంటాడు. దీనికోసం చిన్నప్పటి నుంచే శిక్షణ ఇస్తుంటాడు. వాళ్ల పక్కింట్లోనే ఉండే సూర్య (విశాల్) కూడా భరత్ లక్ష్యం పట్ల ఆకర్షితుడవుతాడు. సూర్యలోని ప్రతిభను గమనించిన భరత్.. తన బిడ్డతో పాటే అతనికీ పోలీస్ శిక్షణ ఇస్తాడు. ఈ క్రమంలోనే సూర్య, రాజీవ్ మంచి స్నేహితులవుతారు. ఇద్దరి జీవితాలు లక్ష్యం దిశగా సాగుతున్న క్రమంలో అనుకోకుండా భరత్ కల్యాణ్ హత్యకు గురవుతాడు. అనంతరం సూర్య, రాజీవ్‌ల దారులు వేరవుతాయి. అయితే కొన్నేళ్ల తర్వాత ఈ స్నేహితులిద్దరూ శత్రువులుగా ఎదురుపడాల్సి వస్తుంది. మరి వాళ్లిద్దరి శత్రుత్వానికి కారణమైన విషయం ఏంటి? అసలు భరత్‌ను హత్య చేసింది ఎవరు? ఈ కథలో అనీషా (మమతా మోహన్‌దాస్), అశ్విత (మృణాళిని రవి)ల పాత్రలేంటి? ఆఖరికి మిత్రులిద్దరూ కలిశారా?లేదా?అన్నది తెరపై చూడాలి.
ఎలా ఉందంటే: సింగపూర్‌లోని లిటిల్ ఇండియా అనే ప్రాంతంలో సాగే కథ ఇది. ఇద్దరు స్నేహితులు.. శత్రువులుగా మారితే ఏం జరిగింది? అసలు వాళ్లిద్దరూ అలా మారడానికి కారణమేంటి? ఈ ఇద్దరి మధ్య జరిగిన పోరులో ఆఖరికి పైచేయి ఎవరిదైంది? అన్నది చిత్ర కథాంశం. విశాల్, ఆర్యల ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ కథకు చక్కటి యాక్షన్ హంగులు జోడించి ఆసక్తికరంగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు ఆనంద్ శంకర్. అయితే కథని రసవత్తరంగా నడపడంలో ఆది నుంచే ఇబ్బంది పడినట్లు కనిపించాడు. ప్రారంభంలో తొలి 20నిమిషాల్ని సూర్య, రాజీవ్‌ల ఫ్లాష్‌బ్యాక్ కోసం.. ఆ తర్వాత మరో 15నిమిషాల సమయాన్ని విశాల్ ఇంట్రడక్షన్ కోసమే తినేశాడు దర్శకుడు. ఆయా సన్నివేశాలన్నీ చాలా నెమ్మదిగా.. రొటీన్‌గా సాగడంతో ప్రేక్షకులకు సీరియల్ చూస్తున్న అనుభూతి కలుగుతుంది. మధ్యలో ప్రకాశ్‌రాజ్ హత్యోదంతం ప్రేక్షకుల్లో ఆసక్తిరేకెత్తించినా.. ద్వితీయార్ధం కోసం ఆ ఎపిసోడ్‌ను అలా పక్కకు పెట్టాడు దర్శకుడు. విరామ సమయానికి ముందు రాజీవ్ లిటిల్ ఇండియాలోకి అడుగుపెట్టడం.. అతను చేయాల్సిన ఓ మర్డర్ ఆపరేషన్‌ను సూర్య అడ్డుకోవడంతో కథలో వేగం పెరుగుతుంది. ఇక ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డాక వచ్చే సన్నివేశాలు కాసేపు ఆసక్తిరేకెత్తిస్తాయి. అయితే సూర్యపై రాజీవ్ ద్వేషం పెంచుకోవడానికి వెనకున్న కారణం తెలిశాక.. ఈ మాత్రం దానికే ఇంత హంగామా అవసరమా అనిపిస్తుంది.
అయితే ప్రధమార్ధంతో పోలిస్తే, ద్వితీయార్ధంలో కథ కాస్త వేగంగా నడిచినట్లు అనిపించినా.. సూర్య, రాజీవ్‌ల మధ్య వచ్చే మైండ్ గేమ్ ఎపిసోడ్స్ చాలా పేలవంగా అనిపిస్తాయి. మధ్యలో రాజీవ్ పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకునే ఎపిసోడ్ కథకి కాస్త ఊపు తెచ్చినట్లు అనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో సూర్య - రాజీవ్‌ల మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే ఈ ఎపిసోడ్ మరీ సుదీర్ఘంగా సాగడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లవుతుంది. ఇక చివర్లో సినిమాని ముగించిన తీరు చూస్తే.. కథను ఇంత అర్ధాంతరంగా ముగించాడేంటి అనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే: విశాల్, ఆర్యలు మాత్రమే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సూర్య, రాజీవ్‌లుగా ఇద్దరూ తమ తమ పాత్రలకు నూటికి నూరుశాతం న్యాయం చేసే ప్రయత్నం చేశారు. యాక్షన్ సన్నివేశాల్లో నువ్వానేనా అన్నట్లు పోటీ పడి నటించారు. మమతా మోహన్‌దాస్, మృణాళిని రవిల పాత్రలు అలంకార ప్రాయంగానే మిగిలాయి. తెరపై అలా వచ్చి పోతుంటారు తప్ప.. వారి పాత్రల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇక పాటలు మరీ ఇబ్బంది పెట్టాయి. కథ కాస్త వేగం పుంజుకుంటుంది కదా అనిపించిన ప్రతిసారీ పాటలు బ్రేకుల్లా అడ్డుపడ్డాయి. కథ విషయంలో ఆనంద్ పెద్దగా కసరత్తు చేయలేదనిపిస్తుంది. లాజిక్ లేకుండా ప్రతి సీన్‌ను తనకు నచ్చినట్లుగా పేర్చుకుంటూ వెళ్లిపోవడంతో.. ఎక్కడా ఓ అర్ధవంతమైన కథ చూసినట్లు అనిపించదు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను ట్రిమ్ చేసుకోవాల్సింది. అలాగే హీరోలిద్దరి మధ్య బలమైన సంఘర్షణను రాసుకోలేకపోయారు. తమన్ పాటలు ఏమాత్రం మెప్పించవు. శామ్.సిఎస్ నేపథ్య సంగీతం, రాజశేఖర్ ఛాయాగ్రహణం ఫర్వాలేదనిపించాయి.
బలాలు
+ విశాల్, ఆర్య నటన
+ క్లైమాక్స్ ఫైట్
బలహీనతలు
- కథ.. కథనం.. పాటలు
- సాగతీత సన్నివేశాలు
చివరిగా: ప్రేక్షకుల పాలిట ‘ఎనిమి’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- Cinema news
- Cinema Review
- Enemy Review
- Prakash Raj
- సినిమా న్యూస్
- సినిమా రివ్యూ
- ఎనిమి రివ్యూ
- ప్రకాశ్‌రాజ్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
పరీక్షల వల్ల ఫహద్ సినిమాకు నో చెప్పా: నజ్రియా
ప్రేమలో ఉండే వేదాంతమంతా ఈ పాటలో చెప్పేశారు: ఇంద్రగంటి మోహన కృష్ణ
‘పుష్ప2’ ట్రైలర్.. ఈ ఆసక్తికర విషయాలను గమనించారా?
ఎట్టకేలకు ‘ఎమర్జెన్సీ’ విడుదల ఖరారు.. ఎప్పుడంటే!
అందుకే నయనతారతో ఆ సినిమా చేయడం లేదు: ఆర్జే బాలాజీ
సౌత్ ఇండియాలో ‘పుష్ప2’ ట్రైలర్ హవా.. రికార్డు సృష్టించిన పుష్పరాజ్..
క్లిష్ట సమయంలో పెదనాన్న అండగా నిలిచారు: నారా రోహిత్
కుమార్తెతో కలిసి థెరపీ తీసుకున్నా: ఆమిర్ ఖాన్
నయనతార బర్త్‌డే స్పెషల్ వచ్చేసింది.. కొత్త సినిమా టైటిలిదే!
పుట్టినరోజు సందర్భంగా నయనతార కొత్త సినిమాను ప్రకటించారు.
వైల్డ్‌ఫైర్ మొదలైంది.. ‘పుష్ప2’ ట్రైలర్‌పై రాజమౌళి పోస్టు
ఈ వారం ప్రేక్షకులను అలరించే థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
అతడు జెంటిల్‌మ్యాన్.. సినీ హీరోలపై మీనాక్షి చౌదరి సరదా కామెంట్స్..
రివ్యూ: ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’.. ఎలా ఉంది?
పుష్ప అంటే ఫైర్ కాదు.. వైల్డ్ ఫైర్
ఇది చాలా వెరైటీ సినిమా.. ఏమాత్రం బోర్ కొట్టదు: విష్వక్ సేన్
‘తండ్రీతనయులు’ సిద్ధమవుతున్నారు!.. డిసెంబరు నుంచి రంగంలోకి..
ఆల్ఫా అవకాశంతో ఎగిరి గంతేశా!
డూప్ లేకుండా తాప్సీ యాక్షన్?
అజయ్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్
‘కాంతార చాప్టర్ 1’.. విడుదల ఖరారు
‘బిగ్‌బాస్’లో ఈ వారం ఎలిమినేషన్.. ఆఖరిలో ట్విస్ట్..
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
తాజా వార్తలు (Latest News)
పాకిస్థాన్ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రైవేటు వీడియో లీక్..!
ఆర్‌బీఐ నుంచి త్వరలో తక్కువ ధరకే క్లౌడ్ సేవలు.. మన డేటా ఇక లోకల్!
కోల్‌కతా ఘటన.. నిందితుడి గొంతు వినిపించకుండా పోలీసుల హారన్లు..!
ముగిసిన ‘మహా’ ప్రచారం.. చివరిరోజు ‘యాడ్’ వార్
లగచర్లలో దాడి చేసింది కేటీఆర్ అనుచరులే: మంత్రి కోమటిరెడ్డి
ఎంపీ విందులో ముక్కల కోసం కొట్లాట..! ‘మటన్ వార్’ అంటూ అఖిలేశ్ సెటైర్లు
- Latest News in Telugu
- Sports News
- Ap News Telugu
- Telangana News
- National News
- International News
- Cinema News in Telugu
- Business News
- Political News in Telugu
- Photo Gallery
- Hyderabad News Today
- Amaravati News
- Visakhapatnam News
- Exclusive Stories
- Health News
- Kids Telugu Stories
- Real Estate News
- Devotional News
- Food & Recipes News
- Temples News
- Educational News
- Technology News
- Sunday Magazine
- Rasi Phalalu in Telugu
- Web Stories
- Pellipandiri
- Classifieds
- Eenadu Epaper
For Editorial Feedback eMail:
For digital advertisements Contact : 040 - 23318181
- TERMS & CONDITIONS
- PRIVACY POLICY
- ANNUAL RETURN
© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics .
Privacy and cookie settings
Enemy Review – Tiring Action Drama
OUR RATING 2.25/5
CENSOR ‘U/A’ Certified, 2h 39m
What Is the Film About? Surya (Vishal) and Rajiv (Arya) are childhood friends, but they have a rivalry going on whenever they compete with each other. They are trained by Bharat ( Prakash Raj ), Rajiv’s father who believes Surya is a naturally gifted policeman than his son.
What happens when Rajiv takes the wrong route in life? How Surya comes into Rajiv’s life unexpectedly, rekindling the old rivalry, and where it ends is the movie’s basic storyline.
Performances Vishal and Arya are well cast for the respective roles. On paper Arya has a meatier role, playing the anti-hero. The part has scope for crowd-pleasing moments. However, Arya fails in doing so. It is mainly due to weak writing more than anything else.
Vishal playing the righteous hero part is well within his zone and delivers. He has a romantic track, emotional moments, dances and fights like a typical star. He excels in all of them.
Both, Vishal and Arya, are equally balanced and it doesn’t look like one is dominating the other anywhere.
Analysis Anand Shankar directs Enemy. It is another attempt in his zone. He attempts a larger than life action epic with a unique core element. In Enemy’s case, it is friends turned foes.
The opening segment of the movie is well done. The whole childhood episode sets up the movie brilliantly. A couple of episodes involving ‘Photographic Memory’ are thrillingly done. The one where Surya shares his thoughts is particularly impressive.
The movie then moves to the present and we are back to normal commercial stuff. The hero introduction and the subsequent entertainment stuff is on predictable lines. The former is passable, but the latter is weak.
Enemy gains momentum again with the arrival of the enemy. The whole pacemaker sequence is neatly executed with all the thrills in place. It is fresh on-screen and also ups the ante for the meet between the protagonist and antagonist.
The interval, therefore, raises the expectations on the second half even though it’s done normally without a big bang.
The second half starts well with the confrontation between Vishal and Arya. However, what is also clear is that smartness seen previously is gone. Enemy veers into a dumb commercial zone with the antics of Arya.
What happens next and the reaction of Arya to it further takes things on the dumber route. It wouldn’t be a problem if it weren’t for the backstory of Arya’s character Rajiv. For such a high profile assassin what he does is pretty basic and stupid.
And then the director unleashes his inner Christopher Nolan and serves us The Dark Night redux in Enemy. All of a sudden Vishal is the Batman and Arya becomes the joker. The entire pre-climax and climax are xerox copies of the classic Hollywood. Only here there is no energy or thrill.
The whole thing drags to a predictable end. The dialogues are poor and the pacing doesn’t help the cause either. The action between the two is decent, though.
On the whole, Enemy starts well and delivers moderate thrills in the first half. The second half nosedives after a point and it never recovers. It wastes the potential of an engaging action thriller. Still, give it a try if you like the genre and don’t mind some recycled stuff.
Mamta Mohandas & Others? The heroines have small roles in the movie which is all about the male leads. Among the two, Mamta Mohandas is better even if it’s a smaller part. Mrinali just disappears after the initial sequences.
Thambi Ramaiah once again gets a humorously dramatic part. It is right down his alley and he delivers. Prakash Raj in a brief appearance is impactful. The kids playing one younger version of the leads are good. The rest of the cast is forgetful as most of the focus is elsewhere.
Music and Other Departments? S Thaman provides the music to the film whereas Sam CS gives the background score. The former is alright with a song registering. The latter is effective even though it is loud. The cinematography by. RD Rajasekhar is neat. There is a grand and slick appeal for the most part. The editing could have been better. The writing is weak for an action thriller where is a huge emphasis on drama.
Highlights? Story Vishal-Arya Thrilling Moments In First Half
Drawbacks? Lengthy Slow Pace Writing Pre-climax Climax
Alternative Take The whole pre-climax and climax need to be rewritten with a different angle. The focus on personal life would be a start.
Did I Enjoy It? Yes, In parts
Will You Recommend It? Yes with huge reservations
Enemy Telugu Movie Review by Siddartha Toleti
IMAGES